రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాట్లాడారు. సినిమాకు రాజకీయ రంగు పూయడం మాకు ఇష్టంలేదు. దయచేసి చిత్రపరిశ్రమకు నేను చెప్పేది ఒక్కటే. పరిశ్రమ సాధకబాధకాలు తెలిసినవాళ్లే మాట్లాడండి. అలాంటివారితోనే మా ప్రభుత్వం కూడా మాట్లాడుతుంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడటా నికి నిర్మాతలు రండి. హీరోలొచ్చి నమస్కారాలు పెట్టాల్సిన పనిలేదు. నటరత్న ఎన్టీఆర్ ఔన్నత్యం మాలో ఉంది. గర్తుంచుకోండి అని అన్నారు.
అడగ్గానే టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. డిమాండ్‌ని బట్టి సైప్లె ఉంటుంది. శంకర్‌గారి సినిమాలను చెన్నైలో నేనే బ్లాక్‌లో కొని చూశా. తొలిరోజు టికెట్‌కి డిమాండ్ ఉంటుంది. మరోవైపు బడ్జెట్ పెరిగింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తం అయింది. టికెట్ రేట్లు పెంచితే తప్పేముంది? పెరిగిన ప్రతి రూపాయికీ 18శాతం జీయస్టీ కడుతున్నాం. ఊరకే ఇవ్వడంలేదు. దీనిపై తప్పుగా ప్రచారం చేస్తున్నారు. టికెట్ రేట్లు పెరిగితే ప్రభుత్వానికే ఆదాయం అని పవన్ తెలిపారు.
రామ్‌చరణ్ ఇంతపెద్ద నటుడు అవుతాడని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటాడనీ మేం ఎవరం ఊహించ లేదు. మెగాస్టార్ కొడుకు గ్లోబల్‌స్టారే అవుతాడు అని నిరూపించాడు. శంకర్‌గారి సినిమాలను ఇష్టంగా చూసేవాడ్ని. ఈ రోజు రామ్‌చరణ్, తారక్, రాజమౌళి, వీరంతా ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారంటే దానికి కారకులైన దర్శకుల్లో శంకర్ ఒకరు. అంత గొప్ప దర్శకుడు గేమ్‌ఛేంజర్ ని తెలుగులో తీయడం ఆనందించదగ్గ విషయం. ఇది సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని అర్థమవతుంది. సినిమా అంటే విలువలుండాలి. హీరోలు మంచి చెప్పాలి. బాధ్యతగా ఉండాలి. వినోదంతోపాటు ఆలోచింపజేసే సినిమాలు రావాలి. శంకర్ సినిమాలు అలాగే ఉంటాయి అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఏపీ రాజకీయాలు మార్చిన గేమ్‌ఛేంజర్ పవన్‌కల్యాణ్‌గారు ఈ వేడుకకు రావడం మరిచిపోలేని అనుభవమని రామ్‌చరణ్ ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్, దిల్‌రాజు తదితరులు మాట్లాడారు.