దిలీప్ ప్రకాష్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఉత్సవం. ఈ సినిమాకు అర్జున్ సాయి దర్శకుడు. సురేష్ పాటిల్ నిర్మించారు. బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, రాజేంద్రప్రసాద్, నాజర్, అలీ, ప్రేమ, ఎల్‌బీ శ్రీరామ్ తదితరులు నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉత్సవం చిత్ర టీజర్ ఆవిష్కరణ వేడుకకు ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారుడు చనిపోవచ్చు గానీ కళ చనిపోకూడదు అంటూ ప్రకాష్‌రాజ్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. టీజర్ విడుదల అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ నటీనటులు వారి తాలూకు జీవితంతో నాకు ఓ భావోద్వేగభరితమైన అనుబంధం ఉంది. ఆర్ట్ ఈజ్ లాంగ్. లైఫ్ ఈజ్ షార్ట్. చివరి వరకూ మిగిలిపోయేది కళ మాత్రమే అన్నారు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ధైర్యంతోపాటు కథను సినిమాటిక్‌గా చెప్పే నేర్పు కావాలి. ఇంత మంది నటీనటుల తో సినిమాను అద్భుతంగా తీశారు. ఇదొక ఉత్సవంలా ఉంటుంది అన్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్‌లా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శకుడు అర్జున్ సాయి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: అనూప్ రూబెన్స్, రచన-దర్శకత్వం: అర్జున్ సాయి.