Namaste NRI

ఫస్ట్ డే ఫస్ట్ షో సెకండ్ సింగల్

శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత జంటగా వంశీధర్‌ గౌడ్‌, పి. లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో. సరికొత్త కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆసక్తికరమైన ప్రమోషన్స్‌ కంటెంట్‌తో క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌సింగిల్‌, టీజర్‌కు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందన వచ్చింది.  ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండో లిరికల్‌ గీతాన్ని విడుదల చేశారు. నీ నవ్వే నీ చిరునవ్వే.. నే కోరే వెన్నెల అంటూ సాగే ఈ పాటకు రథన్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. రామ్‌ మిర్యాల ఆలపించారు. సరికొత్త వినోదాత్మక కథాంశంతో రూపొందిన చిత్రమిది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి  శ్రీజ ఏడిద నిర్మాత. శ్రీరామ్‌ ఏడిద సమర్పిస్తున్నారు. దర్శకుడు కె.వి. అనుదీప్‌ కథ అందించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కూర్పు : మాధవ్‌, ఛాయాగ్రహణం: ప్రశాంత్‌ అంకిరెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events