గౌతమ్‌కృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం సోలో బాయ్. పి.నవీన్‌కుమార్ దర్శకుడు. సెవెన్ హిల్స్ సతీశ్ కుమార్ నిర్మాత. ఈ సినిమా నిర్మాణం తుదిదశకు చేరుకుంది.ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. సపోర్ట్ చేసిన టీమ్‌కి దర్శకుడు కృతజ్ఞతలు తెలిపారు. సోలో బాయ్ మంచి సినిమా అని, దర్శకుడు నవీన్‌కుమార్ అద్భుతమైన కథ రాసుకుని, అంతే అద్భుతంగా తెరక్కెంచాడని, గౌతమ్‌కృష్ణ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడని నిర్మాత చెప్పారు. నీలో మంచి రిథమ్ ఉంద ని, కష్టపడితే కచ్చితంగా పెద్ద డాన్సర్‌వి అవుతావని సందీప్ మాస్టర్ చెప్పి, నాతో అద్భుతంగా డాన్స్ చేయిం చాడని, ఈ సినిమా సక్సెస్ కోసం పనిచేసిన అందరికీ థ్యాంక్సని హీరో గౌతమ్‌కృష్ణ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా సంధ్య.