Namaste NRI

భారత్‌-దుబాయ్‌ మధ్య నడిచే  విమానాలు రద్దు

నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్‌ ని భారీ వర్షాలు ముంచెత్తాయి . ఒక్కసారిగా బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన జడివాన కురిసింది. భారీ వర్షంతో వరదలు సంభవించాయి. దీంతో దుబాయ్‌ మొత్తం స్తంభించిపోయింది. ప్రపంచం లోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్‌ అంతర్జాతీయ విమా నాశ్రయాన్ని సైతం వరద ముంచెత్తింది. రన్‌వేపై మోకాళ్లలోతులో నీరు ఉండటంతో విమానాల రాకపో కలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దుబాయ్‌కు వచ్చే పలు విమానాలను అధికారులు దారి మళ్లిస్తు న్నారు. మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు.

భారత్‌ – దుబాయ్‌ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు సివిల్‌ ఏవియేషన్‌ శాఖ అధికారులు వెల్లడించారు. భారత్‌ నుంచి దుబాయ్‌ వెళ్లే 15 విమానాలు, దుబాయ్‌ నుంచి భారత్‌కు రావాల్సిన 13 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం అంది స్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్ట్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించేం దుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మొత్తం నీట మునిగింది. రన్‌వేపైకి భారీగా నీరు వచ్చి చేరింది. విమానాశ్రయం పార్కింగ్ కూడా సగం నీట మునిగింది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events