అబుదాబిలోని జాయేద్ అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తేబోతున్నది. స్మార్ట్ ట్రావెల్ ప్రాజెక్ట్ ద్వారా 2025 నాటికి ఈ ఎయిర్‌పోర్ట్ అంతటా బయోమెట్రిక్ సెన్సర్లు అమర్చుతారు. ఇవి ప్రయాణికుల ముఖ కవళికలను గుర్తించగలుగుతాయి. కాబట్టి ప్రయాణికులు పాస్‌పోర్టు చూపించడం, తనిఖీలు చేయించుకోవడం వంటివి అవసరం ఉండదు. ప్రయాణం వేగంగా, భద్రంగా, సౌకర్య వంతంగా జరుగుతుంది. ఇది అమల్లోకి వస్తే, ఫేషియల్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని వినియోగించే తొలి అంతర్జాతీయ విమానాశ్రయంగా రికార్డు సృష్టిస్తుంది.