Namaste NRI

న్యూయార్క్‌ సిటీ చరిత్రలో మొదటిసారి

న్యూయార్క్‌ సిటీ చరిత్రలో మొదటిసారి దీపావళి నాడు అక్కడి స్కూల్స్‌ అన్నీ సెలవు ప్రకటించాయి. హిందువుల ముఖ్య పండుగ దీపావళి పురస్కరించుకొని నవంబర్‌ 1న నగరంలోని స్కూళ్లన్నింటికీ సెలవు ఇచ్చినట్టు న్యూయార్క్‌ సిటీ డిప్యూటీ కమిషనర్‌ దిలీప్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో మేయర్‌ కార్యాలయం దీపావళి రోజును పబ్లిక్‌ హాలిడేగా అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఇది స్కూళ్లకు కూడా వర్తింపజేసింది. న్యూయార్క్‌ నగరంలో సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులున్నారు. స్కూల్‌కు వెళ్లాలా? గుడికి వెళ్లాలా? అన్న టెన్షన్‌ వాళ్లకు ఈ ఏడాది లేదు. దీపావళి వేడుకను సంతోషంగా గడుపుకునేందుకు సెలవు ప్రకటించాం. ప్రవాస భారతీయులు, వారి సంఘాల నాయకులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు ఎన్నో ఏండ్లుగా చేస్తున్న డిమాండ్‌ను సిటీ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ నెరవేర్చారు అని దిలీప్‌ చౌహాన్‌ చెప్పారు.

Social Share Spread Message

Latest News