
జారా శతావరి పేరు ఇప్పుడీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కృత్రిమ మేథా (ఏఐ) ద్వారా సృష్టించిన అందగత్తెల కోసం ప్రపంచంలోనే తొలిసారి ఫ్యాన్‌వ్యూ సంస్థ నిర్వహిస్తున్న అందాల పోటీలో భారత్‌కు చెందిన శతావరి టాప్-10లోకి దూసుకెళ్లింది. యాడ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు రాహుల్ చౌదరి ఈ ఏఐ సొగసరి సృష్టికర్త. జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్ బ్రాండ్ అంబాసిడర్‌గా జారా వ్యవహరిస్తున్నది. నోయిడాకు చెందిన డిజిమోజో ఈ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్ గా చేరింది.
