ఫ్రాన్స్‌లో ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన తొలి రౌండ్ పార్లమెంటరీ ఎన్నికల్లో మరైన్ లీ పెన్ సారథ్యంలోని రైట్ వింగ్ పార్టీ నేషనల్ ర్యాలీ(ఆర్‌ఎన్) ముందంజలో నిలిచింది. మొత్తం ఓట్లలో ఆర్‌ఎన్ కూటమికి 35.15 శాతం ఓట్లు దక్కగా, వామపక్ష న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) 27.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇమ్మాన్యూయెల్ మాక్రాన్ నేతృత్వంలోని మధ్యేవాద ఎన్‌సెంబుల్ అలయెన్స్ కేవలం 20.76 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది. దీంతో నేషనల్ ర్యాలీ పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పా టు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా ఫ్రాన్స్‌లో రైట్ వింగ్ అధికారంలోకి రానున్నది. కాగా, జూన్ 9న జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన మాక్రాన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.