Namaste NRI

రోడ్డున పడ్డ భారతీయులకు… సాటా అధ్వర్యంలో ఆపన్నహస్తం

సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలోని ఒక ఫర్నిచర్ పరిశ్రమ మూతబడడంతో అందులో పని చేస్తున్న సుమారు 150 మంది ప్రవాసులు రోడ్డున పడ్డారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న ఆ ప్రవాసీయులను ఆదుకోవడానికి రియాధ్ నగరంలోని తెలుగు ప్రవాసీయులు ముందుకు వచ్చారు. రెండు నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఆ ప్రవాసులకు అందించారు. తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్, ప్రముఖ సామాజిక సేవకుడు పోకూరి ఆనంద్‌ల అధ్వర్యంలో తెలుగు ప్రముఖులు చిట్లూరి రంజీత్, జి. ఆనందరాజు, కొరపోలు సూర్య, శ్రీనివాస రెడ్డి, నగేశ్, లక్ష్మణ్, చంద్ర, అమ్మిరెడ్డి మరియు ప్రవీణ్‌లు కలిసి నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రవాసీల సహాయంతో వీరికి తమవంతుగా సహాయం అందించారు.

వాస్తవానికి కొంతకాలంగా తెలుగు కుటుంబాలు ఈ కార్మికులకు తమకు వీలయిన విధంగా వ్యక్తిగత రూపంగా సహాయం చేస్తున్నప్పటికి సామూహికంగా మాత్రం సాటా అధ్వర్యంలో ఇప్పుడు అందరికి సహాయం చేయడం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన భారతీయ కార్మికులు, చేసిన పనికి వేతనాలు అందక, కంపెనీ వల్ల వీసాలు రెన్యువల్ కాలేక ఇబ్బందులను ఎదుర్కోంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. తినడానికి తిండి లేక చేతిలో చిల్లిగవ్వ లేకుండా నరకయాతన అనుభవిస్తున్న ఈ కార్మికుల గురించి ముజ్జమీల్ తోటి తెలుగు వారి దృష్టికి తీసుకొచ్చారు. అందరూ కలిసి ఉద్యోగాలు కోల్పోయిన ప్రవాసులకు సాయం చేశారు.  సాటా చేసిన సాయాన్ని మర్చిపోలేమని ఈ సందర్భంగా పలువరు ప్రవాసులు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events