Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ సర్కారుపై … విదేశీ విద్యార్థుల దావా

విద్యా సంవత్సరం మధ్యలో తమను దేశం నుంచి వెళ్లగొడుతూ డొనాల్డ్‌ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆకస్మిక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అమెరికా వ్యాప్తంగా పలు ఫెడరల్‌ కోర్టులలో పలువురు విదేశీ విద్యార్థులు కేసులు దాఖలు చేశారు. తమను అన్యాయంగా టార్గెట్‌ చేసి దేశం నుంచి వెళ్లగొడుతున్నారని, ఎలాంటి న్యాయపరమైన ప్రక్రియ పాటించకుండా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోం ల్యాండ్‌ సెక్యూరిటీ తమ వీసాలను రద్దు చేసిందని, దీని కారణంగా వందలాది మంది విద్యార్థులు దేశ బహిష్కరణ శిక్షను ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

హార్వర్డ్‌ వర్సిటీకి నిధుల స్తంభన క్యాంపస్‌లో విద్యార్థుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ డిమాండ్లను తిరస్కరించినందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీకి 220 కోట్ల డాలర్ల (రూ. 18,864 కోట్లు) గ్రాంట్లు, కాంట్రాక్టులను స్తంభింపచేస్తున్నట్టు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.పన్ను మినహాయింపు ప్రతిపత్తిని తొలగిస్తామని కూడా హెచ్చరించింది. రాజకీయ సంస్థగా గుర్తిస్తూ పన్నులు విధిస్తామని ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీని హెచ్చరించారు. గత శుక్రవారం యూనివర్సిటీకి రాసిన లేఖలో పాలన, నాయకత్వ సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం డిమాండు చేసింది. కాగా, ప్రభుత్వ డిమాండ్లను హార్వర్డ్‌ ప్రెసిడెంట్‌ అలాన్‌ గార్బర్‌ తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆదేశాల్ని ఆయన తప్పుపట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events