బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బి ఎన్ పి అధినేత్రి ఖలీదా జియా(80) కన్నుమూశారు.ఊపిరితిత్తులు, గుండె సంబంధిత సమస్యలతో నవంబర్ లో ఢాకా ఎవర్ కేర్ ఆస్పత్రిలో చేరారు.తర్వాత క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది ,దీంతో మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు.

ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. ఆమె 1991-1996, 2001-2006 మద్య 10 సంవత్సరాలు ప్రధాని గా పని చేశారు. అవినీతి కేసులో 2018-2020 వరకు జైల్లో ఉన్నారు, ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ వచ్చారు. మరో కుమారుడు ఆరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేసియా లో చనిపోయారు.















