తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురి పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు పరిశీలించారు. తాజాగా అధ్యక్షుడి రేసులో మరో పేరు తెరమీదకు వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పేరును ఖరారు అయినట్లు తెలుస్తోంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష పదవిపై అనాసక్తి కనబరుస్తున్నారని, వ్యక్తిగత కారణాలతో పదవి స్వీకరించడానికి నిరాకరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బక్కని నరిసింహులు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే, పార్టీ అధినేత చంద్రబాబు ఒకటి రెండురోజుల్లో కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్టు సమాచారం. అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించనున్నారు.