Namaste NRI

మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

 అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్  మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కు బెంగళూరు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు  విధించింది. రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఇందులో రూ.7లక్షలు బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. ప్రజ్వల్‌ను ఈ కేసులో ప్రత్యేక కోర్టు శుక్రవారం నాడు దోషిగా నిర్ధారించింది. తీర్పును శనివారానికి వాయిదా వేసింది. కాగా, తాజాగా తీర్పును వెలువరించింది.  పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగు చూడటం సంచలనమైంది. దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

ప్రజ్వల్ కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్‌లో పని చేసే మహిళ 2024 ఏప్రిల్‌లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదేపదే తనపై అత్యాచారం చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌ మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.

సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతున్నందున తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ప్రజ్వల్ ఇటీవల కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ కోర్టును ఆశ్రయించాలని, కోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం పైకోర్టుకు అప్పీల్‌ చేసుకోవచ్చని హైకోర్టు జులై 9న పేర్కొంది. దీంతో రేవణ్ణ తిరిగి విచారణ కోర్టును ఆశ్రయించగా, బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Social Share Spread Message

Latest News