ఆర్‌బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ కు మరో కీలక పదవి దక్కింది. ప్రధాని నరేంద్రమోదీకి ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. శక్తికాంత దాస్ పదవీ కాలం నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నంత వరకు లేదంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఏది ముందైతే అప్పటిదాకా ఉంటుందని కమిటీ తన నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రెటరీగా శక్తికాంత దాస్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆర్‌బీఐ గవర్నర్ గా ఆరేళ్లు పనిచేసిన ఆయనకు ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో విశేష అనుభవం ఉంది. ఎకనామిక్స్, ఫైనాన్స్, మినరల్స్, రెవెన్యూ శాఖలతోపాటు జీ20 షెర్ఫా, ఏడీబీ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వ్యవహారాలపై మంచి పట్టుంది.
