Namaste NRI

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామా అరెస్ట్‌

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీగా అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వేళ‌,  డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎఫ్‌బీఐ అధికారులు ఒబాను అరెస్టు చేసిన‌ట్లు ఏఐ వీడియోను త‌న సామాజిక మాధ్య‌మం ట్రూత్‌లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అధికారులు అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేసిన‌ట్లుగా దానిని రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్‌ నవ్వుతూ కనిపించారు. అనంత‌రం ఖైదీ దుస్తుల్లో ఉన్న ఒమాబా క‌ట‌క‌టాల్లో ఉన్న‌ట్లుగా అందులో చూపించారు. ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ చ‌ట్టానికి అధ్య‌క్షుడు అతీతుడే అన్న‌ట్లుగా ఉంది. ఆ వెంట‌నే ప‌లువురు రాజ‌కీయ నేత‌లు చ‌ట్టం కంటే ఎవ‌రూ ఎక్కువ కాదు అని పేర్కొన్న‌ట్లు ఉంది.

Social Share Spread Message

Latest News