Namaste NRI

శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ఘవలియో డి లా లిజియన్‌ హానర్‌ వరించింది. థరూర్‌ రచనలు, ప్రసంగాలను గౌరవిస్తూ ఈ అవార్డును ప్రకటించినట్లు భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మాన్యుయేల్‌ లెనియన్‌ తెలిపారు. తనకు పురస్కారం దక్కడంపై థరూర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఫ్రాన్స్‌తో సంబంధాలను సమర్థించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాదించే వ్యక్తిగా ఈ అవార్డు పొందడాన్ని గౌరవంగా భావిస్తున్నా. నన్ను దీనికి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. శశిథరూర్‌ గతంలో ఐక్యరాజ్య సమితి అండర్‌ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ పదవికి పోటీ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events