ఆటిజం గర్భం నుంచే మొదలవుతుంది, మీ పిల్లల జీవితంలోకి ప్రవేశించకముందే దాన్ని అడ్డుకోండి”
రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి సూచించారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్
డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి మాట్లాడుతూ
ఆటిస్టిక్ సమస్య ఎదుర్కొంటున్న బాలలో గట్-బ్రెయిన్ యాక్సిస్‌ను పరిష్కరించే ఒక ప్రధాన చికిత్స ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ థెరపీని భారతదేశంలో అందిస్తున్న మొట్టమొదటి సంస్థ రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ అని అన్నారు.
ఆటిజం బాధితులకు అక్టోబరు 29- నవంబరు 15 వరకు హైదరాబాద్‌లోని మణికొండలో
రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఉచిత అసెస్‌మెంట్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది.
వృత్తిపరంగా కార్డియాలజిస్టు అయిన డా. చంద్రశేఖర్ తొడుపునూరి ఆటిజం లేని తరాన్ని సాధించడానికి వీలుగా విషరహిత గర్భధారణకు వీలు కలిపించే లక్ష్యంతో పేగు – మెదడు కు సంబంధించి శాస్త్ర సాంకేతిక రంగంలో లోతైన పరిశోధనలు సాధించేందుకు వీలుగా రెస్ ప్లైస్ ఇన్సిస్టిట్యూట్ ను స్థాపించారు. 2015 లో జన్మించిన తన కూతురుకు ఆటిజం ఉందని తెలిసిన పిమ్మట తాను స్వయంగా చిన్నారికి పెగు (గట్) కు సంబంధించిన పలు ఇబ్బందులను గమనించడం జరిగింది. దీంతో ఆటిజంతో పాటూ పేగు (గట్) సంబంధిత పనితీరు సరిగా లేకపోవడం, అలర్జీలు రావడం చూసి చలించిపోయి సాంప్రదాయ వైద్యంలో ఈ రుగ్మతకు సంబంధించి విస్మరించబడి మూల కారణాలను వెతికే దిశగా పరిశోధనలకు స్వీకారం చుట్టారు. ఇందుకోసం హైదరాబాదులో రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ను స్థాపించారు.

ఈ మూల కారణాలను వెతికే దిశగా 2017 లో ప్రారంభమైన ఈ పరిశోధనలో ప్రధానంగా ఆటిజంతో భాదపడుతున్న చిన్నారులలో పేగు (గట్) మైక్రోబియోమ్ యొక్క పాత్రను అర్థం చేసుకొనే ప్రయత్నాలు జరిగాయి. ఇలా పేగు (గట్) మైక్రోబియోమ్ కు సంబంధించిన సమస్యలకు చికిత్స అందించడం ద్వారా ఆటిజం ఉన్న చిన్నారుల యొక్క జీవన ప్రమాణాలతో పాటూ వారి యొక్క ప్రవర్తన, నడవడి లక్షణాలు ఏమైనా మార్చగలుగుతామా అన్న దిశలో ఈ పరిశోధనలు సాగాయి. ఈ పరిశోధనల ఫలితంగా రెండు ప్రధాన ఆవిష్కరణలు (1) పేగు (గట్) మైక్రోబయోమ్ మార్పిడి (Gut Microbiome Transplantation – FMT) మరియు విషరహితమైన వ్యాధిని నియంత్రించే ప్రోటోకాల్స్ ద్వారా ఆటిజం చిన్నారులలోనే కాకుండా పెద్దలలో కూడా పేగు సంబంధింత సమస్యలకు పరిష్కారం మరియు కీమోథెరపీతో తర్వాత క్యాన్సర్ పేషెంట్లలో కూడా (2) తల్లుల గర్భదారణ సమయాలలో మరియు పర్యావరణ మార్పుల ద్వారా జననానికి ముందు ఆటిజం మరియు ఇతర బాహ్యజన్యుపరంగా ప్రభావితమైన రుగ్మతలను నివారించడానికి ఒక ముందస్తు సాధనంగా చూడడం పై దృష్టి కేంద్రీకరించడం జరిగింది. తద్ఫలితంగా ప్రస్థుతం డా. చంద్రశేఖర్ తొడుపునూరి ICMR (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి) వారి అనుమతి పొందిన పేగు (గట్) మైక్రోబయోమ్ మార్పిడి (Gut Microbiome Transplantation – FMT) పరిశోధనలో మొట్టమొదటి స్టూల్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆటిజం తో పాటూ పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మల్టి ఓమిక్స్ పరీక్షలు మరియు మైక్రోబియం సైన్స్ కు నేతృత్వం వహించి నిర్వహిస్తున్నారు.

ఇలా రూపొందించిన కొత్త థరపీలపై ప్రజలలో అవగాహన కలిపిస్తూ అప్పటికే ఆటిజం కలిగిన పిల్లలు కలిగిన తల్లితండ్రులలో ఆటిజం రహిత రెండవ సంతానం పొందే అవకాశాలను పెంపొందించడానికి వీలుగా నేటి ఉదయం హైదరాబాదులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డా. చంద్రశేఖర్ తొడుపునూరి తాము జరుపుతున్న పరిశోధన వివరాలను వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో డా. చంద్రశేఖర్ తొడుపునూరి తో పాటూ పరిశోధనలలో పాలు పంచుకొంటున్న ఇతర వైద్యులు కూడా పాల్గొన్నారు.
విలేఖరుల సమావేశంలో ముందుగా డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి, ఛైర్మన్, రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు మాట్లాడుతూ, “గత 4-5 దశాబ్దాలుగా పెరుగుతున్న ఆటిజం కేసుల సంఖ్య ప్రధానంగా ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలను గుర్తించే దిశలో, చికిత్సలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, పరిశోధన ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచడంలో జరుగుతున్న జాప్యం పురోగతికి ఆటంకం కలిగిస్తోంది. ఉదాహరణకు, ఆటిజం కారణాలపై పరిశోధన 2005లో నిర్వహించినా, అమెరికా (US)ప్రభుత్వం MAHA నివేదిక 2025 వరకు విడుదల కాలేదు. ఇది ఇప్పటికీ ప్రసంచ ఆరోగ్య సంస్థ (WHO)లేదా FDA ఆమోదం కోసం వేచి ఉంది. ఈ సవాళ్లకు ప్రతిస్పందనగా, మేము డాక్టర్ తల్లిదండ్రుల బృందం, ఆటిజం నివారణ, చికిత్సను పరిష్కరించేందుకు రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పాము. రెస్‌ప్లైస్ ఇన్స్టిట్యూట్‌లో, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో సమస్య ఎదురు కాకుండా, దాన్ని నివారించేందుకు మేము యాంటీఆక్సిడెంట్ వ్యూహాలను అభివృద్ధి చేస్తున్నాము. ఇప్పటికే ఆటిజం బారిన పడిన పిల్లల కోసం, వారి జీవన నాణ్యతను మెరుగుపరచేందుకు, మేము చికిత్సలను అభివృద్ధి చేస్తున్నాము. ఉదాహరణకు మల మైక్రోబయోటా మార్పిడి (ఇది 30-40 శాతం ప్రయోజనాన్ని చూపించింది) ద్వారా 70-80 శాతం కోలుకునే అవకాశం ఉన్న అపరిపక్వ న్యూరాన్‌లకు సిగ్నలింగ్ అణువులను లక్ష్యంగా చేసుకుని పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్న కొత్త చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చాము అని వివరించారు.

హైదరాబాద్‌లోని రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్, ఆటిజం, ఇతర నాడీ సంబంధిత పరిస్థితుల నిర్వహణకు సమగ్ర విధానాన్ని అందించే భారతదేశంలో మొట్టమొదటి చికిత్స కేంద్రం. రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆటిజం, న్యూరో డెవలప్‌మెంట్ పరిస్థితులు, జీర్ణశయాంతర రుగ్మతలు, పోస్ట్ కీమో గట్ రికవరీ సవాళ్లకు ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT)), మల్టీ-ఓమిక్స్ ఆధారిత పర్సనలైజ్ చికిత్సలను అందించడంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉంది. రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT)కు అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న గట్-మెదడు అక్షాన్ని (gut-brain axis)పరిష్కరించేందుకు ప్రధాన చికిత్సగా అందిస్తోంది.
రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ నిరంతర పరిశోధనతో ఆటిజం గర్భం నుంచే ప్రారంభమవుతుందని రుజువు చేసింది. అదే విధంగా, వృద్ధి చెందుతున్న ఆటిజం సంభవాన్ని పరిష్కరించేందుకు గర్భస్థ దశ నుంచే దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు, రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఆటిజం నివారణ కార్యక్రమాన్ని కూడా రూపొందించింది.

ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్(FMT) చికిత్స గురించి డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి మాట్లాడుతూ, “మలబద్ధకం, ఉబ్బరం లేదా ఆహారం సహించకపోవడం చాలా మంది ఆటిస్టిక్ పిల్లలు ఎదుర్కొనే జీర్ణ సమస్యలలో ఉన్నాయి. కొత్త గట్ బ్రెయిన్ యాక్సిస్ పరిశోధన ప్రకారం, మన కడుపులోని బ్యాక్టీరియా మెదడుకు సంకేతాలను పంపడం ద్వారా ప్రవర్తన, నిద్ర విధానాలు, అభ్యాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన అధ్యయనాల అనంతరం రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఒక కొత్త చికిత్స ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్(FMT)ను కనుగొంది. ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్(FMT)అనేది ఒక వైద్య ప్రక్రియ. దీనిలో దాత మలం నుంచి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా రోగి జీర్ణవ్యవస్థలోకి బదిలీ చేయడం ద్వారా సమతుల్యత కలిగిన గట్ మైక్రోబయోమ్‌ను పునరుద్ధరిస్తారు. ఇది కొన్ని గట్-సంబంధిత పరిస్థితులకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తారు. నాడీ, జీవక్రియ రుగ్మతలలో దాని సంభావ్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోంది” అని వివరించారు.
ఈ లక్ష్యంలో, ఆటిజం నుంచి పుట్టిన పిల్లల తల్లిదండ్రులైన వైద్యులు తమ సొంత వృత్తిని విడిచిపెట్టి, రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌తో చేతులు కలిపారు. అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న దంతవైద్యురాలు డాక్టర్ కళారమ్య మారేపల్లి, తన ఏడున్నరేళ్ల కుమారుని కోసం అన్నింటినీ విడిచి, భారతదేశానికి తిరిగి వచ్చి, తన కొడుకుకు చికిత్స తీసుకొని, ఫలితాలను చూసిన తర్వాత ఈ ఉద్యమంలో రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు.
ఈ విలేఖరుల సమావేశంలో డా. కళ రమ్య మారేపల్లి కూడా మాట్లాడుతూ తన ఏడున్నరేళ్ల కుమారుని కోసం అన్నింటినీ విడిచి, భారతదేశానికి తిరిగి వచ్చి, తన కొడుకుకు చికిత్స తీసుకొని, ఫలితాలను చూసిన తర్వాత ఈ ఉద్యమంలో భాగస్వామిగా మారానని వివరించారు. ఇది ఇన్‌స్టిట్యూట్ అందించే చికిత్సపై తల్లిదండ్రుల నమ్మకాన్ని రుజువు చేస్తోందని అన్నారు. ఇది ఇన్‌స్టిట్యూట్ అందించే చికిత్సపై తల్లిదండ్రుల నమ్మకాన్ని రుజువు చేస్తోంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను వైద్యులు మాత్రమే కాకుండా, వైద్యులైన బాధితుల తల్లిదండ్రుల కలిసి నిర్వహిస్తుండడం విశేషమని తెలిపారు. రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంటేషన్ (FMT)కు అనేక ఆధునిక రుగ్మతలకు కేంద్రంగా ఉన్న గట్-మెదడు అక్షాన్ని (gut-brain axis)పరిష్కరించేందుకు ప్రధాన చికిత్సగా అందిస్తోందని తెలిపారు.

తదుపరి వైద్యులు మాట్లాడుతూ రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ పరిశోధనలలో అర్థమైందేమిటంటే “ఆటిజం గర్భం నుండే ప్రారంభమవుతుందని గర్భం దాల్చిన మొదటి కొన్ని రోజులతో సహా, గర్భధారణ పూర్తయ్యే వరకు జరిగే సంఘటనలతో ఆటిజం ముడిపడి ఉందని తెలిసిందని వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పిండానికి విషరహిత వాతావరణాన్ని అందించడం ద్వారా ఆటిజం లేకుండా ఆరోగ్యకరమైన శిశువుకు దారితీస్తుంది” అని తెలిపారు. బిడ్డ పుట్టకముందే ఆటిజంను నివారించేందుకు రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించామని వెల్లడించారు. స్మార్ట్ క్లాన్ ప్రోగ్రామ్ అనే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని, ఇది మొదటిసారి తల్లిదండ్రులు భవిష్యత్తులో ఆటిజం ప్రమాదాన్ని తగ్గించేందుకు చురుకైన చర్యలు తీసుకోవడంలో సహాయపడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన అత్యాధునిక వైద్య చికిత్స విధాన బోధన కార్యక్రమని తెలిపారు. దీనితో పాటూ ‘‘ఆటిజం లేని తరం’’ కోసం విషరహిత గర్భధారణను అనుమతించే కేంద్రాన్ని కూడా ఇన్సిస్టిట్యూట్ ఏర్పాటు చేసి, ఈ కేంద్రంలో, గర్భిణిలకు డీటాక్స్ చికిత్స ఇస్తూ, నివారణ నమూనాతో చికిత్స అందిస్తారు. గర్భిణిలకు ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లతో పాటు, జనన పూర్వ కార్యక్రమంలో N-ఎసిటైల్ సిస్టీన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే, గర్భధారణ సమయంలో ప్లాస్టిక్‌లు, పురుగుమందులు, సౌందర్య సాధనాలు మొదలైనవి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకొని శరీరంలోకి విషపదార్థాలు ప్రవేశించకుండా నిరోధించేందుకు గర్భిణులు సేంద్రీయ ఆహారాన్ని మాత్రమే తినేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
అనంతరం రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆవశ్యకత పై ప్రశ్నించినపుడు స్వయంగా ఆటిజం తో ఇబ్బందిపడుతున్న చిన్నారి తండ్రిగా గడించిన స్వీయ అనుభవంతో పాటూ తన కూతురు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం వెతికే దిశగా సాగుతున్న సమయంలో మదిలో నుంచి వచ్చిన ఆలోచనే ఈ పరిశోధనలకు నాంది పలికిందని వివరించారు. తాము జరుపుతున్న పరిశోదనలు ముగింపు దశకు వచ్చాయని ఫిబ్రవరి 2022లో ప్రారంభించిన ICMR ఆమోదించిన మూడేళ్ల అధ్యయనం పూర్తి దశకు దాదాపు చేరుకుంటున్నామని వెల్లడిస్తూ ఈ పరిశోధనలలో భాగంగా పిండం దశలోనే చికిత్స చేయడం ద్వారా ఆటిజం నివారణ తో పాటూ ఆటిజంను మేనేజ్ చేసేందుకు మల మైక్రోబయోటా మార్పిడికి సంబంధించిన అధ్యయనం ఉందన్నారు.

డా. కళ రమ్య మారేపల్లి , చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ (CSO) రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్, మాట్లాడుతూ తాను డెంటల్ డాక్టర్ గా అమెరికాలో వుండేదాన్ని తన కొడుకుకి ఆటిజం సమస్య వుందని గుర్తించాక కెరీర్ వదులుకొని అమెరికా నుండి ఇండియా వచ్చి రెస్‌ప్లైస్ ఇన్సిస్టిట్యూట్ లో ట్రీట్మెంట్ ఇచ్చాక మంచి ఫలితం వచ్చిందని తెలిపారు, ఇలాంటి సమస్య వున్న వారికి ట్రీట్మెంట్ అందిస్తున్న రెస్‌ప్లైస్ ఇన్‌స్టిట్యూట్ తో కలిసి పనిచేస్తున్నా అని అన్నారు ఇది ఆటిజం సమస్య వున్న పిల్లల తల్లిదండ్రులే
డాక్టర్స్ గా నడిపిస్తున్న సంస్థ అని తెలిపారు.
ఈ సందర్భంగా రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ తరపున 29 ఆక్టోబర్ 2025 నుంచి 15 నవంబర్ 2025 ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అని తెలిపారు. దీంతో పాటూ ఆటిజం రోగులకు రెస్‌ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఉచిత అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోందని చెప్పారు. ఈ విలేఖరుల సమావేశంలో డా. చంద్రశేఖర్ తొడుపునూరి, ఛైర్మన్, రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ తో పాటూ డా. కళ రమ్య మారేపల్లి, , CSO, రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ – డా. చంద్రశేఖర రావు, ఓరల్ మరియు మాక్సిఫేసియల్ సర్జన్, మహావీర్ హాస్పిటల్ డా. మురళి మోహన్ రెడ్డి, ఎథిక్స్ కమిటి సభ్యులు, రెస్ ప్లైస్ ఆటిజం రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు పాల్గొన్నారు.
మరిన్ని వివరాలకు :
Resplice Institute
3rd Floor, Above Vijetha Super Market
Near Marrichettu, Shivapuri Colony
Hanuman Nagar, Manikonda,
Hyderabad.
Timings 10 AM – 6 PM
For Registration Call Bhavani- 9100065552
Visit: www.respliceinstitute.com
















