అమెరికా యద్ధ నౌక రిపేర్ కోసం తొలిసారి భారత్‌కు వచ్చింది. అమెరికా నౌకా దళానికి చెందిన చార్లెస్ డ్రూ తమిళనాడుకు చేరుకుంది. చెన్నైలోని కట్టుపల్లి వద్ద ఉన్న లార్సెన్ టూబ్రో షిప్‌యార్డ్‌లో ఆ షిప్‌కు రిపేర్, నిర్వాహణ పనులు చేపడతారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, వైస్ చీప్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎస్‌ఎన్ ఘోర్మాడే, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. చెన్నైలోని అమెరికా కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్, ఢల్లీిలోని యుఎస్ ఎంబసీలో డిఫెన్స్ అటాచ్‌కు చెందిన రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఎస్ నేవీ షిప్‌కు భారత్‌లో మరమ్మత్తు చేయడం ఇదే తొలిసారి. ఓడ నిర్వహణ పనులు చేపట్టేందుకు కట్టుపల్లిలోని ఎల్ అండ్ టీ షిప్‌యార్డ్‌కు యూఎస్ నేవీ కాంట్రాక్ట్ ఇచ్చింది అని ప్రకటించింది. గ్లోబల్ షిప్ రిపేరింగ్ మార్కెట్‌లో భారతీయ షిప్‌యార్డ్‌ల సామర్థ్యాలకు ఇది సూచిస్తుందని తెలిపింది. భారతీయ షిప్‌యార్డ్‌లు అధునాతన సాంకేతికతో, తక్కువ ఖర్చుతో ఓడ మరమ్మత్తు, నిర్వహణ సేవలు అందిస్తాయని వెల్లడిరచింది.














