బ్రిటన్ కంపెనీలు తమ సంస్థల్లో విదేశీ నిపుణులను నియమించుకొనే విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధ నలు తీసుకొచ్చింది. ఇకపై ఏడాదికి కనీసంగా 38,700 పౌండ్ల(దాదాపు రూ.40 లక్షలు) జీతం చెల్లించే ఉద్యోగా లకు మాత్రమే విదేశీయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కనీసంగా 26,200 పౌండ్ల వార్షిక వేతనం చెల్లించే ఉద్యోగాలు చేయడానికి ఇతర దేశాలకు చెందిన వారికి నైపుణ్య ఉద్యోగ వీసాలు ఇచ్చేవారు. దీన్ని తాజాగా 48 శాతం పెంచారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన భారతీయులకు ప్రతి కూలంగా ఉండనున్నది. బ్రిటన్‌లోని వైద్య సిబ్బంది, టెక్ నిపుణులు, విద్యార్థుల సంఖ్యలో భారతీయులు గణనీయంగా ఉంటారు. తక్కువ జీతానికి లభించే విదేశీ సిబ్బంది వలన తమ పౌరులు జీత భత్యాలు కూడా తగ్గిపోతున్నాయని, దీన్ని నివారించేందుకే కొత్త నిబంధన తీసుకొచ్చామని బ్రిటన్ మంత్రి జేమ్స్ క్లెవర్లీ పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతిభావంతులకే వీసాలిస్తామని చెప్పారు.