భారత్‌ను ప్రబల ఆర్థిక శక్తిగా బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి గ్రెగ్ హ్యాండ్స్ అభివర్ణించారు. ఆ దేశంతో అత్యుత్తమ ఉభయతారక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు కీలక అంశాలపై చర్చలు విజయవంతంగా పూర్తయ్యాని తెలిపారు. తదుపరి విడత సంప్రదింపులు త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భారత్‌తో బలమైన ఎఫ్‌టీఏ కుదుర్చుకోగలిగితే, 2035 కల్లా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు కొన్ని వేల కోట్ల పౌండ్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని, అనేక కుటుంబాలు లాభయపడతాయని వివరించారు.














