Namaste NRI

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విశేషాలు

విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి. నేహా శెట్టి కథానాయిక.   కృష్ణచైతన్య దర్శకత్వం.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ చీకటి ప్రపంచంలో సాధారణ స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ యువకుడి ప్రస్థానాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది.  ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు, రాజకీయ పరమైన సంఘర్షణ భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. విశ్వక్‌సేన్‌ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నది అన్నారు.  మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అనిత్‌ మాదాడి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: గాంధీ నడికుడికర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events