జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా పరిచయమవుతున్న చిత్రం రాజు యాదవ్. కృష్ణమాచారి దర్శకుడు. కె.ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మాతలు.ఈ చిత్రంలో అంకిత ఖరత్, ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలోని రాజు యాదవ్ చూడు అనే తొలి గీతాన్ని యువ దర్శకుడు బాబీ విడుదల చేశారు. చంద్రబోస్ రచించిన ఈ గీతానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్నందించారు. రామ్ మిరియాల ఆలపించారు. ప్రేమ పయనంలోని అందమైన భావాలకు అద్దం పడుతూ సాగిందీ పాట. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. వినోదంతో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలుంటాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, రచన-దర్శకత్వం: కృష్ణమాచారి.కె.