Namaste NRI

మరోసారి అవకాశం ఇవ్వాలి :  జో బైడెన్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని బైడెన్‌ ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్‌ పార్టీ తరఫున రీ ఎలక్షన్‌ బిడ్‌ను ప్రారంభించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మరోసారి ఎన్నుకోవాలని, దేశానికి సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన 2024 అధ్యక్ష ఎన్నికలను రిపబ్లికన్ల అతివాదంపై పోరాటంగా బైడెన్‌ అభివర్ణించారు. వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ సైతం వచ్చే ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా తిరిగి పోటీ చేస్తారని బైడెన్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష బరిలో నిలిచే వారి కోసం ఆయా పార్టీల్లో ప్రైమరీ ఎన్నికలు జరుగుతుంటాయి. అధ్యక్షుడు రెండోసారి బరిలోకి దిగుతుండడంతో అధికార పార్టీలో ప్రైమరీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. మరో వైపు రిపబ్లిక్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే అదే పార్టీకి చెందిన ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌ సైతం పోటీ చేసే అవకాశాలున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events