లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ మిస్ పర్ఫెక్ట్ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ వరుణ్‌తేజ్ వంటి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరకడం అదృష్టమని, కెరీర్ విషయంలో కావాల్సినంత స్వేచ్ఛగా ఉన్నా నని చెప్పింది. రొమాన్స్, కామెడీ కలబోసిన కథ ఇది. ఈ సిరీస్‌లో నేను మిస్ లావణ్య, లక్ష్మి అనే క్యారెక్టర్స్‌లో నటించాను. తను ఓ పర్‌ఫెక్షనిస్ట్. ప్రతి పనిలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులొస్తాయి. నా పాత్ర ఎమోషన్స్‌తో సాగుతుంది అని చెప్పింది.
తన వ్యక్తిగత జీవితానికి ఈ రెండు పాత్రలు చాలా దగ్గరగా ఉంటాయని, ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మిలా, సెట్‌లో మాత్రం లావణ్య క్యారెక్టర్‌లా పర్‌ఫెక్షన్ కోరుకుంటానని చెప్పింది. ఈ సిరీస్ వరుణ్‌తేజ్‌కు కూడా బాగా నచ్చిందని, దీని గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా చేశాడని లావణ్య త్రిపాఠి తెలిపింది. నేను గతంలో థ్రిల్లర్, యాక్షన్ సిరీస్‌లు చేశాను. దాంతో ఇప్పుడు రొమాంటిక్ కామెడీ చేయడం చాలా ఈజీగా అనిపించింది. సినిమాల విషయంలో నేను సెలెక్టివ్‌గా ఉంటా. తక్కువ సినిమాలు చేసినా నటిగా గుర్తుండిపోవాలనుకుంటా. ప్రస్తుతం ఓ కొత్త హీరోతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో సినిమా పూర్తి చేశాను. అందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. మరో తమిళ సినిమా చేస్తున్నా అని లావణ్య త్రిపాఠి చెప్పింది.