ప్రవాస భారతీయుడికి అబుదాబిలో రూ.33.89 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. రాజీవ్ ఆరిక్కట్ అనే ఎన్నారై కొనుగోలు చేసిన బిగ్ టికెట్ నంబర్ వీక్లీ డ్రాలో విజేతగా నిలిచింది. అల్ ఐన్ నగరంలో నివసించే రాజీవ్ అర్కిటెక్చర్. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేండ్లుగా బిగ్ టికెట్ కొనుగోలు చేస్తున్న రాజీవ్‌ను ఈ సారి అదృష్టం వరించింది. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్న. ఇంతపెద్ద గ్రాండ్ ప్రైజ్ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది ఒక కలగా ఉన్నది అని బిగ్ టికెట్ నిర్వాహకులతో రాజీవ్ పేర్కొన్నారు.
