కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానం నేడు తెరుచుకుంది. నేటి నుంచి జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. టీకా పొందినట్లు ధ్రువపత్రం చూపించినవారితో పాటు కరోనా ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే దేవస్థానంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తున్నారు. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా దర్శక టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే రోజుకు గరిష్ఠంగా 5 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.