హయ్యర్ స్టడీస్ చదువుతున్న విద్యార్థులు, కార్మికులకు కెనడా శుభవార్త చెప్పింది. తమ జీవిత భాగస్వామిని కెనడాకు రప్పించేందుకు అవసరమయ్యే ఓపెన్ వర్క్ పర్మిట్స్ (ఓడబ్ల్యూపీ) నిబంధనల్ని కెనడా సడలించింది. నూతన ఓడబ్ల్యూపీ విధానాన్ని 2025 జనవరి 21 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆ దేశంలో పనిచేస్తున్న విద్యార్థుల, కార్మికుల భాగస్వాములు కూడా కొత్త ఓపెన్ వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. కెనడా లేబర్ మార్కెట్‌కు, భారతీయ విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రొఫెషనల్ కోర్సులు, డాక్టోరల్, మాస్టర్స్ ప్రోగామ్స్, 16 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ గడువు కలిగిన కోర్సులు చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల భాగస్వాములు అర్హులుగా పేర్కొన్నది.