Namaste NRI

 చైనా శుభవార్త …ప‌ర్యాట‌కుల‌కు

చైనాలోకి వ‌స్తున్న ప‌ర్యాట‌కుల‌కు పీసీఆర్  నెగ‌టివ్ రిపోర్టు అవ‌స‌రం లేదు. జీ కోవిడ్ పాల‌సీలో భాగంగా చైనా తాజా నిర్ణ‌యం తీసుకున్న‌ది. చైనాకు వ‌స్తున్న ప‌ర్యాట‌కులు శ‌నివారం నుంచి కేవ‌లం యాంటీజెన్ టెస్ట్ రిజిల్ట్‌ను చూపిస్తే స‌రిపోతుంది. అయితే బోర్డింగ్‌కు 48 గంట‌ల ముందు ఆ రిపోర్టును పొంది ఉండాలి. ఈ విష‌యాన్ని చైనా విదేశాంగ శాఖ ప్ర‌తినిధి మావో నింగ్ తెలిపారు.మూడేళ్ల నుంచి క‌రోనా వ‌ల్ల చైనాలో క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. కొన్ని దేశాల నుంచి వ‌స్తున్న ప్ర‌యాణికులు క‌చ్చితంగా పీసీఆర్ నెగ‌టివ్ రిపోర్టును తీసుకురావాల్సి వ‌చ్చేది. అయితే క‌ఠిన నిబంధ‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు వెల్లువెత్త‌డంతో,  గ‌త డిసెంబ‌ర్ నుంచి ఆ దేశం ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తోంది. ఇక నుంచి చైనాకు వ‌స్తున్న ఎయిర్‌లైన్స్‌ పీసీఆర్ రిపోర్టు కూడా చూడ‌వ‌ని తెలిపారు.

Social Share Spread Message

Latest News