Skip to main content

Namaste NRI

భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం : మార్కో రూబియో

భారతదేశ‌ 80వ స్వాతంత్ర్య‌ దినోత్సవం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యమే ఇందుకు కారణమని చెప్పారు.

రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేథ‌, అంతరిక్షం, వాణిజ్య రంగాల్లో ఇరుదేశాల సహకారం మరింత విస్తరిస్తోందని తెలిపారు. భారత్‌, అమెరికా ప్రజల మధ్య ఉన్న స్నేహం, ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని రూబియో పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం కేవలం రెండు దేశాల ప్రయోజనాలకే పరిమితం కాదని, అంతకు మించి విస్తరించి ఉందని స్పష్టంచేశారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఢిల్లీతో పరస్పర సహకారానికి వాషింగ్టన్ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events