సూపర్‌స్టార్ రజినీకాంత్, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. తలైవా 171 గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. లోకేష్ కనగరాజ్- రజినీకాంత్ కాంబోలో ఈ సినిమా రాబోతుండడంతో ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ అంతా ఎక్జయిటింగ్‌గా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి టైటిల్ టీజర్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు ప్రకటించనున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ చిత్రంలో రజినీకాంత్ లగ్జరీ వాచ్‌లు దొంగతనం చేసే దొంగలా కనిపించునున్నట్లు టాక్. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.