Namaste NRI

సౌదీ అరేబియా గుడ్ న్యూస్.. ఇకపై ఆ అవకాశం

వలసదారులకు సౌదీ అరేబియా ప్రభుత్వం  తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రవాసులు తమ వివాహ ధృవీకరణ పత్రం  సౌదీ న్యాయస్థానాల నుంచి పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇక్కడ చిన్న షరతు విధించింది. వధువు తండ్రికి సౌదీలో నివాసం ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని ఆ దేశ న్యాయమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రవాస దంపతులు కింగ్‌డమ్‌ను  విజిట్ లేదా ట్రాన్సిట్ వీసాపై విజిట్ చేసిన సమయంలో తమ వివాహ ఒప్పంద పత్రాన్ని పొందవచ్చని వెల్లడించింది. దీనిలో భాగంగా కపుల్స్ నజీజ్ సెంటర్ ఫర్ జ్యుడీషియల్ సర్వీసెస్ ద్వారా తమ వివాహాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలని మంత్రిత్వశాఖ సూచించింది. ఈ సర్వీస్ కోసం నజీజ్ పోర్టల్  ను సందర్శించాల్సిందిగా తెలిపింది. ఈ సేవలను ప్రవాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా న్యాయమంత్రిత్వ శాఖ తెలియజేసింది.

Social Share Spread Message

Latest News