Namaste NRI

వీసాల కోసం చూస్తున్నవారికి… గుడ్‌న్యూస్

విద్యార్థి వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిలిపేసిన నేపథ్యంలో అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి టామీ బ్రూస్‌ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, త్వరలోనే ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. ఆన్‌లైన్‌ స్పాట్స్‌ ఎప్పుడు ఓపెన్‌ అవుతాయో తరచూ చెక్‌ చేసుకోవాలని దరఖాస్తుదారులకు సూచించారు. ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ వీసా ప్రాసెస్‌లో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటిస్తూ, దేశ భద్రత, ప్రజల రక్షణపైనే దృష్టి పెట్టిందని చెప్పారు. వీసాను పొందడం జన్మహక్కు కాదని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News