Namaste NRI

గోపీచంద్ భీమా టీజ‌ర్ రిలీజ్

గోపీచంద్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం భీమా. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండ‌గా,  ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఒక నిమిషం పాటు ఉన్న ఈ టీజ‌ర్ అసలు క‌థ గురించి ఏమాత్రం హింట్ ఇవ్వకుండా ఆసక్తికరమైన విజువల్స్‌తో సాగింది. ముఖ్యంగా టీజ‌ర్‌లో వ‌చ్చే యదా యదా హి ధర్మస్య పవిత్రాణాయ సాధూనాం, అంటూ వ‌చ్చే శ్లోకాలు అభిమానుల‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మ‌రోవైపు ఈ రాక్ష‌సుల‌ను వేటాడే బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు అంటూ గోపీచంద్ ఎద్దుపై ఎంట్రీ ఇవ్వ‌డం టీజ‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఈ సినిమాలో గోపీచంద్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ పోస్టర్ విడుద‌ల చేయ‌గా, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు కెమెరా: స్వామి జె గౌడ, నిర్మాత: కేకే రాధామోహన్‌, దర్శకత్వం: ఎ.హర్ష.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events