గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రామబాణం. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏపీలోని రాజమండ్రిలో ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ కుటుంబ అనుబంధాలు, విలువల గొప్పతనం గురించి ఈ సినిమాలో చర్చించాం. జగపతిబాబు, గోపీచంద్ నటించిన సన్నివేశాల్ని చూస్తుంటే నిజంగా అన్నదమ్ములేమో అనుకుంటారు. అంతలా వారు పాత్రల్లో లీనమైపోయారు. గోపీచంద్‌ను నటుడిగా మరో మెట్టెక్కించే చిత్రమవుతుంది అని తెలిపారు.

గోపీచంద్ మాట్లాడుతూ దర్శకుడు వాసుతో నాకిది మూడో చిత్రం. లక్ష్యం, లౌక్యం తరహాలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తుంటే మన ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది’ అన్నారు. ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది. మిక్కీ జే మేయర్ మంచి పాటలిచ్చారు. ఈ వేసవిలో ఇంటిల్లిపాది కలిసి చూసే చక్కటి కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాకు రామబాణం అనే టైటిల్‌ను పెట్టినందుకు బాలకృష్ణగారికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

అలీ మాట్లాడుతూ గోపీచంద్ ముప్పై సినిమాలు చేస్తే అందులో ఐదారు తప్పితే అన్ని చిత్రాల్లో ఆయనతో కలిసి నటించాను. గోపీచంద్ చాలా మంచి మనిషి. ఆయనకు ఎప్పుడూ విజయాలే దక్కాలని కోరుకుంటున్నా అన్నారు. మే 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
