Namaste NRI

భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌లో గోపీచంద్

హీరో గోపీచంద్‌ ఓ ప్రెస్టీజియస్‌ హిస్టారికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంకల్పరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. 55రోజుల్లో ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ని పూర్తి చేశామని, ప్రస్తుతం గోపీచంద్‌తోపాటు ప్రధాన తారాగణంపై వెంకట్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్‌ యాక్షన్‌ స్పీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్నామని, ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ సినిమాకు మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు.

దేశచరిత్రలోని ప్రముఖమైన అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపైకి తెస్తున్నామని, ఇందులో గోపీచంద్‌ మహాయోధునిగా కనిపిస్తారని, అద్భుతమైన ఎమోషన్స్‌తోపాటు, విజువల్‌ గ్రాండియర్‌తో ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని, గోపీచంద్‌ కెరీర్‌లో మైలురాయిగా సినిమా నిలుస్తుందని మేకర్స్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌ రాజన్‌, సంగీతం: అనుదీప్‌ దేవ్‌, సమర్పణ: పవన్‌కుమార్‌, నిర్మాణం: శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events