Namaste NRI

గోపీచంద్ 32వ చిత్రం.. ఆ దర్శకుడితోనే

టాలీవుడ్ స్టార్‌ హీరో గోపీచంద్,  డైరెక్టర్‌ శ్రీనువైట్ల డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. గోపీచంద్‌ 32 గా వస్తున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ చిత్రాన్ని లీడింగ్‌ బ్యానర్‌ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దొండె పూరి నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్‌. ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే సమకూరుస్తుండగా,  చేతన్ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్, ఇతర నటీనటు లెవరనే దానిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్టు సమాచారం. సినిమా కొత్త షెడ్యూల్‌ మార్చి 27 నుంచి షురూ కానుందని తెలియజేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద బ్యానర్‌తో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని వేణు దోణెపూడి అన్నారు. అత్యున్నత ప్రొడక్షన్‌ టీం, సాంకేతిక విలువలతో భారీ స్థాయిలో సినిమా తెరకెక్కిస్తున్నా మని, సినిమా చాలా బాగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొత్త షెడ్యూల్‌లో లీడ్ యాక్టర్లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు చెప్పారు. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్‌ పూర్తవుతుందని తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events