Namaste NRI

కెనడా ప్రభుత్వం తీపి కబురు… అక్టోబర్ 1 నుంచి

అంతర్జాతీయ ప్రయాణికులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎట్టకేలకు కరోనా నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో అమలవుతున్న కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తేస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి క్వారెంటైన్ పాలసీతో సహా కొవిడ్‌కు సంబంధించిన నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టు స్పష్టం చేశారు. కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఉన్న కారణాన్ని ఆ దేశ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వెల్లడించారు. కెనడా పౌరులు అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని.. వారి ఆరోగ్యానికి ప్రమాదంలేదని భావించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల కెనడాలో రవాణా రంగం తిరిగి పూర్తి స్థాయిలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events