సీనియర్ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చక్రవ్యూహం. దిట్రాప్ అనేది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకుడు. సావిత్రి నిర్మాత. ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి, వివేక్ త్రివేది, ఊర్వశి పరదేశి, ప్రజ్ఞా నయన్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రియ, శ్రీకాంత్ అయ్యంగార్, కిరీటి, రాజ్ తిరందాసు, రవితేజ, మోహన్ నటీస్తున్నారు. ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. విజువల్స్, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందతుందనే నమ్మకం ఉంది అన్నారు.


ఈ చిత్రానికి రచన & దర్శకత్వం: చెట్కూరి మధుసూధన్, నిర్మాత: సహస్ర క్రియేషన్స్, సహ నిర్మాతలు: వెంకటేష్ డ అనూష, డాప్: జి వి అజయ్ కుమార్, ఎడిటర్: జెస్విన్ ప్రభు, సంగీతం: భరత్ మంచిరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: జాస్తి అజయ్, చిలుక మహేష్, DI:లైట్ లైన్ స్టూడియో, PRO: మేఘా శ్యామ్ , ధీరజ్ ఉ ప్రసాద్. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
