తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టిసిఎస్ఎస్) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు అరుళ్ముగు వేలు మురుగన్ జ్ఞానమునీశ్వర్ ఆలయంలో ఘనంగా జరిగాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సింగపూర్ స్థానిక కాలమాన ప్రకారం ప్రత్యేకంగా రాయించిన గంటల పంచాంగాన్ని సభ్యులకు అందజేశారు. ఈ గంటల పంచాంగాన్ని ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగ కర్తలు కప్పగంతు సుబ్బరామ సోమయాజులు, మార్తి శివరామ యజ్ఞనారాయణ శర్మ సిద్ధం చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా నంగునూరి సౌజన్య, జూలూరు పద్మజ, మాదారపు సౌజన్య, దీప నల్లా, బసిక అనితా రెడ్డి వ్యవరించారు. కార్యక్రమంలో టిసిఎస్ఎస్ అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి పాల్గొన్నారు.