
ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డు అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులను కోరుకునే అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల అర్హతలను హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సవరించనున్నది. వచ్చే ఏడాది జనవరి నాటికి ఇవి సిద్ధం కావొచ్చు. ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు కోసం విదేశీ నిపుణులు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అర్హత, డాక్యుమెంటేషన్ ప్రమాణాలను ఇందులో ప్రభుత్వం నిర్వచించనున్నది. ఇది భవిష్యత్ దరఖాస్తుదారులు, యజమానుల నియామక వ్యూహాలను ప్రభావితం చేస్తుంది. అంటే సాధారణ నైపుణ్యాలు, సాధారణ అర్హతలు ఉన్న వారికి ఈ విభాగంలో గ్రీన్‌కార్డుల లభ్యత కఠినతరం కానుంది.
















