స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడుస్తుండటంతో అంతర్జాతీయంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మూలాలున్న ఇటాలియన్ ఆస్ట్రోనాట్ సమంత క్రిస్టోఫొరెట్టి భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి (ఇస్రో) ఇంటర్నేషనల్ ఏజెన్సీ నుంచి శుభాభినందనలు తెలిపారు. 2023లో ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఈ మేరకు అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్కు ఓ వీడియో సందేశం పంపించారు. మానవులను అంతరిక్షంలో పంపించడానికి ఇస్రో మొదటిసారిగా చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ, నాసా, అంతర్జాతీయ భాగస్వాముల పక్షాన కోరుకుంటున్నానని తెలిపారు.














