Namaste NRI

అమెరికాలో కొత్త చాప్టర్లు ప్రారంభించిన జీటీఏ

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల‌ను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) మరో కీలక ముందడుగు వేసింది.  అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ అలుమల మల్లారెడ్డి (ఇండియా ఛైర్మన్), విశ్వేశ్వర్ రెడ్డి (అమెరికా ఛైర్మన్) అతిథులను ఆత్మీయంగా సత్కరించారు.

Social Share Spread Message

Latest News