Namaste NRI

గుర్రం పాపిరెడ్డి టీజర్‌ విడుదల

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న చిత్రం గుర్రం పాపిరెడ్డి. మురళీమనోహర్‌ దర్శకత్వం.  ఈ  చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో తాను జడ్జి పాత్రలో నటించానని బ్రహ్మానందం తెలిపారు. డార్క్‌ కామెడీ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ఆద్యంతం హాస్యప్రధానంగా అలరించే చిత్రమిదని దర్శకుడు మురళీమనోహర్‌ పేర్కొన్నారు.

ఈ సినిమా ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకురావడం ఆనందగా ఉందని, బ్రహ్మానందం గారితో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చిందని యోగిబాబు అన్నారు. ఈ చిత్రంలో తాను సౌదామిని అనే పాత్రలో నటించానని, బ్రహ్మానందం, యోగిబాబు వంటి కామెడీ సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని కథానాయిక ఫరియా అబ్దుల్లా తెలిపింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి సంగీతం: కృష్ణసౌరభ్‌, నిర్మాతలు: వెను సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events