Namaste NRI

హమ్మయ్య సత్యభామ వచ్చేస్తుంది

కాజల్‌ అగర్వాల్‌  టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాలా డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. క్రైం థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆరమ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్దన్‌, రవి వర్మ, అంకిత్‌ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్‌ ఎడ్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్‌ కాజల్‌ స్టైలిష్ గన్‌ లోడ్‌ చేసి పేలుస్తున్న విజువల్స్‌తో డిజైన్‌ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో భయంతో పరిచయం లేని సత్యభామ అనే పోలీసాఫీసర్‌గా కాజల్ కనిపించబోతుందని గ్లింప్స్‌, టీజర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్‌. ప్రతి పాత్ర ఒక ప్రయాణమే, కానీ సత్యభామ నిజంగా ఒక విప్లవం. ఈ జూన్‌లో న్యాయం కేవలం విధి కాదు, ఇది ఒక వాగ్దానం. అంటోంది మేకర్స్ టీం.  మే 31న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా మరో తేదీకి వాయిదా పడింది. సత్యభామ జూన్‌ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events