Namaste NRI

ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి .. ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రెజిల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరో వేదికగా ప్రారంభమైన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతల తో మోదీ వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ లను భారత్‌కు అప్పగించాలని ఆయన్ని మోదీ కోరారు. భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేసి విజయ్‌ మాల్యా దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన ఉదంతం 2018లో వెలుగులోకి వచ్చింది. అతను కూడా విదేశాలకు పారిపోయాడు. వీరితోపాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్ను మధ్యవర్తి సంజయ్‌ భండారీని కూడా రప్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది.

ఈ కేసును సీబీఐ, ఈడీ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా నీరవ్‌ ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమం లో నీరవ్‌ మోదీ తమదేశంలోనే నివసిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో ప్రకటించింది. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేయగా, 2019లో నీరవ్‌ మోదీని అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ పరిణామాలతో నీరవ్‌ అక్కడి కోర్టులో పిటిషన్‌ వేయగా,  దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా వీరిని అప్పగించాలంటూ బ్రిటన్‌ ప్రధానిని మోదీ కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events