12వ శతాబ్దానికి చెందిన నటరాజ కంచు విగ్రహంతో పాటు మొత్తం 248 ప్రాచీన కళాఖండాలను అమెరికా భారత్కు వెనక్కు ఇచ్చింది. వీటి విలువ రూ.112 కోట్లు (15 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్ లో జరిగిన వేడుకలో భారత్కి అందజేసారు. గత దశాబ్దకాంలో అయిదు కేసుల నేర విచారణలో భాగంగా వీటిని రికవరీ చేసినట్లు మాన్హట్టన్ జిల్లా అటార్నీ వాన్స్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)