Namaste NRI

రిపబ్లిక్ డే సందర్భంగా హరి హర వీరమల్లు  టీజర్

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు. పవన్ సరసన నిధి అగర్వాల్ నాయికగా కనిపించనుంది.  మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ తారలు బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తుండగా,  అతని సోదరి రోషనార పాత్రను నర్గీస్ ఫక్రి పోషిస్తున్నది. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టీజర్ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు సమాచారం. పాన్ ఇండి యా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దాదాపు రెండు సంవత్సరాలుగా రూపొందుతోంది. షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి కావస్తోంది. ఈ వేసవిలో ఈ సినిమా థియేటర్ల లోకి రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events