చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో 1989లో జరిగిన యధార్థగాధ హరోం హర. సుధీర్‌బాబు నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత. ఈ కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో సుధీర్‌బాబు న్యూ పవర్‌ఫుల్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ పోస్టర్ ద్వారా విడుదల తేదీని అధికారంగా ప్రకటించారు. చేతిలో తుపాకీతో ఉన్న సుధీర్‌బాబు పవర్‌ఫుల్ పోస్టర్ యువతరానికి నచ్చేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సునీల్ ప్రత్యేక పాత్ర పోషిస్తు న్నారు. జూన్ 14న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, ఎడిటింగ్: రవితేజ.