1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ ఫిల్మ్ హరోం హర. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం. సుమంత్ జి.నాయుడు ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ కృష్ణ జయంతి రోజైన మే 31న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. రీలీజ్ డేట్ పోస్టర్‌లో సుధీర్‌బాబు వేలాయుధం పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. చిత్తూరు జిల్లా నేపథ్యానికి చెందిన సినిమా కావడంతో అక్కడి స్లాంగ్ ని ప్రాక్టీస్ చేసి, ఇందులో నటించారు సుధీర్. తప్పక విజయం సాధించే సినిమా ఇదని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్.